దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాను రిలీజ్ చేసే సమయంలో.. దానికి పోటీగా మరో సినిమా ఉండకూడదని అనధికారికంగా ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఆ సినిమా కొన్ని కారణాల వలన రెండు, మూడు సార్లు వాయిదా పడినా కూడా ఎవరూ దానికి అడ్డు పడే ప్రయత్నం చేయలేదు. ఆల్రెడీ షెడ్యూల్ అయిన సినిమాలు పక్కకి జరిగిపోయాయి. అందులో మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమా కూడా ఉంది. నెల రోజులు వాయిదా వేసుకొని మరీ ‘బాహుబలి’ సినిమాకి అవకాశం ఇచ్చారు.
‘బాహుబలి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచే సినిమా అని.. ఎంతో కష్టపడి, భారీ బడ్జెట్ తో నిర్మించారని.. అలాంటి సినిమాకి ఇబ్బంది రాకూడదనే తమ సినిమాను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా దీనికి పోటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు బాహుబలి రేంజ్ లో తెరకెక్కించామని భావిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఈ సినిమాకి అన్ని భాషల నుంచి పోటీ తప్పడం లేదు.
తమిళంలోనే ఒక పేరున్న సినిమా దాంతో తలపడడానికి సిద్ధమైంది. ఆ సినిమానే ‘నానే వరువేన్’. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను సెల్వ రాఘవన్ రూపొందించారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో పోలిస్తే ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా క్రేజ్, రేంజ్ అన్నీ ఎక్కువే. కానీ అలాంటి సినిమాకి పోటీ రాకుండా ఉంటేనే బాగుంటుంది.
కానీ సెప్టెంబర్ 30న పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ అవుతుండగా.. దానికంటే ఒకరోజు ముందుగా ధనుష్ సినిమాను విడుదల చేయబోతున్నారు. మరోపక్క హిందీలో ‘విక్రమ్ వేద’ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా ఒకట్రెండు సినిమాలు ఆ రోజున విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!