టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను అనుభవిస్తుంది పూజా హెగ్డే. వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న పూజా… ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ ల తో బిజీగా ఉంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈమె వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న పూజా కొన్ని ఆశక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ… ‘‘సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో శుక్రవారం వస్తుందంటే ఏదో తెలియని ఒత్తిడికి గురవుతుండేదాన్ని.
సినీ నటుల జాతకాలు ఆ రోజు మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి. నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే… రిజల్ట్ ఎలా ఉంటుందా అనే టెన్షన్ ఉండేది. ముందు రోజు అస్సలు నిద్ర పట్టేది కాదు. ఎవరు ఫోన్ చేసి ఏ విషయం చెబుతారా? అని మరొక టెన్షన్. కానీ, ఇప్పుడింత ప్రెజర్ లేదు. ‘ఏం జరిగినా నా మంచికే’ అని అనిపిస్తుంటుంది. నేను సెలెక్ట్ చేసుకునే పాత్ర కోసం వంద శాతం కష్టపడతాను.
రిజల్ట్ ప్రేక్షకులు చేతిలో ఉంటుంది. హిట్ అయితే నా హార్డ్ వర్క్ కి తగ్గ అప్రిషియేషాన వచ్చింది హ్యాపీగా ఫీలవుతా. అదే ఫ్లాప్ అయితే మిస్టేక్ ఎక్కడ జరిగిందో క్రాస్ చెక్ చేసుకుని తరువాతి సినిమాకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.