ప్రభాస్ పై హీరోయిన్ పూజా కామెంట్స్…!

  • November 9, 2020 / 12:06 PM IST

పూజా హెగ్దే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తోంది. రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా డ్యూయల్ రోల్ లో కనిపించబోతుందని సమాచారం. లాక్ డౌన్ తరువాత.. మొన్నటి వరకూ ఇటలీ లో జరుగుతూ వచ్చిన ‘రాధే శ్యామ్’ షూటింగ్లో పాల్గొంటూ వచ్చిన ప్పూజా హెగ్దే… ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని షూటింగ్ అప్డేట్స్ ను షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా హీరో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ల్ కూడా తెలిపింది మన బుట్టబొమ్మ.

సాధారణంగా ప్రభాస్ కు కాస్త సిగ్గు ఎక్కువ అని ఇప్పటి వరకూ అతనితో పనిచేసిన దర్శక నిర్మాతలు చెబుతుంటారు.అయితే షూటింగ్ స్పాట్ లో అతను చాలా సిన్సియర్ గా అలాగే సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంటాడు అని కూడా గతంలో వారు చెప్పుకొచ్చారు.ఇదే విషయాన్ని పూజా హెగ్డే మరోసారి చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని తెలిపింది. అందులోనూ మేమిద్దరం కలిసి ‘లవ్ స్టోరీ’ లో నటిస్తున్నాం కాబట్టి …

మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పుకొచ్చింది.మేమిద్దరం బాగా క్లోజ్ అయిపోవడంతో ఓ దశలో ప్రభాస్ నన్ను ర్యాగింగ్ చేసేవాడని… అతను చాలా నాటీ’ అని కామెంట్స్ చేసింది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus