11 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. ఆ హీరోతో పూజా డేటింగ్ ఏంటి?

పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అంతేకాదు తెలుగులో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న నటి కూడా ఈమెనే..! మరోపక్క బాలీవుడ్ లో కూడా ఈమె వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది. ఈ ఏడాది అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో హీరోయిన్ గా నటించి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యామ్ (వర్కింగ్ టైటిల్), అలాగే అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. వంటి చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది పూజా.

కోలీవుడ్ నుండీ కూడా ఈమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి.. కానీ తొందరపడకుండా ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే గతంలో అప్పటి బాలీవుడ్ హీరో కొడుకుతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ఖండించింది పూజా. ఇదిలా ఉండగా కొద్దిరోజుల నుండీ… పూజా హెగ్డే ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరెవరో కాదు మన ప్రభాస్.

ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ ల్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి పై ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ప్రభాస్ కు 40 ఏళ్ళ వయసు ఉంది.. ఇక పూజా హెగ్డే వయసు 29. ఇద్దరికీ మధ్య 11 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది.. అందులోనూ కెరీర్ పీక్స్ లో ఉండగా పూజా పెళ్లి చేసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న?

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus