పూజా హెగ్డేని (Pooja Hegde) మొదట్లో ఐరన్ లెగ్ అన్నారు. కానీ ‘డిజె – దువ్వాడ జగన్నాథం’ తో (Duvvada Jagannadham) ఆమెను స్టార్ హీరోయిన్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar). ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘అరవింద సమేత'(Aravinda Sametha Veera Raghava) ‘మహర్షి’ (Maharshi) ‘అల వైకుంఠపురములో'(Ala Vaikunthapurramuloo) .. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఆమె ఖాతాలో పడ్డాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం అందుకునే రేంజ్ కి వెళ్ళింది.
కానీ ఆ తర్వాత చేసిన ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) ‘బీస్ట్'(Beast), ‘ఆచార్య’(Acharya) ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) వంటి సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో గ్లామర్ ను కాదని నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ‘రెట్రో’ (Retro) చేసింది పూజ. ఇందులో సూర్య (Suriya) హీరోగా నటించాడు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో 2 బడా సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘కూలి’ (Coolie) ఇంకోటి ‘జన నాయగన్'(Jana Nayagan). వీటితో పాటు లారెన్స్ (Raghava Lawrence) ‘కాంచన 4’ లో కూడా నటిస్తుంది.
ఇందులో ‘కూలి’ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది చిన్న పాత్రే అయినప్పటికీ.. అత్యంత కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. ఫామ్లో లేని పూజకి ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ‘కూలి’ కనుక పూజ ప్లాపులకి ఫుల్ స్టాప్ పెడితే… ఆమె గట్టెక్కినట్టే అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె పై ఉన్న ప్లాపు ముద్ర తొలగిపోతుంది. ఆ తర్వాత ‘జన నాయగన్’ కనుక హిట్ అయితే ఆమె తిరిగి ఫామ్లోకి వచ్చేసినట్టే..!
Arangam Adhirattume, Whistle Parakkattume! #CoolieIn100Days ⏳#Coolie worldwide from August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees… pic.twitter.com/M8tqGkNIrJ
— Sun Pictures (@sunpictures) May 6, 2025