అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా తమన్నా (Tamannaah) హీరోయిన్ గా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘100% లవ్’ (100% Love). ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనకి నిర్మాతగా ఇదే మొదటి సినిమా. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2011 మే 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట ఈ సినిమాపై ఆడియన్స్ లో పెద్ద నమ్మకం లేదు. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి రిలీజ్ అయ్యింది.
అయితే మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా 100% లవ్ (100% Love) క్లోజింగ్ కలెక్షన్స్ ని ఒక లుక్కేద్దాం రండి :
నైజాం | 6.05 cr |
సీడెడ్ | 2.50 cr |
ఉత్తరాంధ్ర | 1.90 cr |
ఈస్ట్ | 1.42 cr |
వెస్ట్ | 1.28 cr |
గుంటూరు | 1.22 cr |
కృష్ణా | 1.07 cr |
నెల్లూరు | 0.68 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 16.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.95 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.07 cr |
‘100% లవ్’ (100% Love) చిత్రం రూ.10.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.18.07 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.7.27 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.