ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన పూజా హెగ్డే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మినహా తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలలో పూజా హెగ్డే నటించారు. ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. వరుస హిట్లతో పూజా హెగ్డేకు క్రేజ్ పెరుగుతోంది.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో తగ్గనని చెబుతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో పూజా హెగ్డేకు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీని సినిమాలలో హీరోయిన్ గా తీసుకోవడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బీస్ట్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పారితోషికం విషయంలో పూజా హెగ్డే కొంచెం కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పూజా హెగ్డేను రెమ్యునరేషన్ తగ్గించమని కోరగా పూజా హెగ్డే నో చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.