Nani, Pooja Hegde: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైందా?

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలలో నటిస్తూ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాని పూజాహెగ్డే కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. వరుస ఫ్లాపుల వల్ల ఈ మధ్య కాలంలో పూజాహెగ్డేకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే. పూజా హెగ్డేకు మరో ఛాన్స్ దక్కిందని తెలిసి ఆమె ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

సిబి చక్రవర్తి డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే ఎంపికైనట్టు తెలుస్తోంది. డాన్ సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సిబి చక్రవర్తికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. శివ కార్తికేయన్ తో ఈ దర్శకుడు తెరకెక్కించిన డాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. నానితో సినిమా తెరకెక్కిస్తే సిబి చక్రవర్తి దర్శకునిగా మరో మెట్టు పైకి ఎదుగుతాడని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అర్జున్ రెడ్డి తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని భోగట్టా.

నాని పూజా హెగ్డే కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా రాలేదు. ఈ కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుందని అభిమానులు సైతం ఫీలవుతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నాని తర్వాత ప్రాజెక్ట్ లు భారీ లెవెల్ లో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఇతర భాషల్లో సైతం నాని సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నాని (Nani) నటించిన క్లాస్ సినిమాల కంటే మాస్ సినిమాలకే బిజినెస్ పరంగా కలిసొస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని మాస్ ప్రాజెక్ట్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నాని కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus