ఆ వార్తల్లో నిజం లేదు :పూజా హెగ్దే

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ … అలాగే మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్ … బిజీగా ఉండే హీరోయిన్.. ఎవరంటే టక్కున చెప్పే పేరు పూజా హెగ్దే. ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బుట్ట బొమ్మ… ఇప్పుడు అఖిల్ కు జోడీగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ అనే చిత్రం చేస్తుంది. దాంతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20 వ చిత్రంలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్.

అప్పుడప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ ఈ బ్యూటీ చాలా బిజీగా ఉన్న తరుణంలో ఓ తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు చాలా వరకూ ఆ వార్తలు వైరల్ గా కూడా మారిపోయాయి. విషయం ఏమిటంటే… పూజా హెగ్దే… సూర్య సరసన ఆమె ‘అరువా’ సినిమా చేయబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి.

దర్శకుడు హరి ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడని కథనాలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై పూజ హెగ్డే స్పందించింది. “హలో .. హలో మీరు తొందరపడకండి .. నేను ఇంతవరకూ ఏ తమిళ సినిమాకు సైన్ చెయ్యలేదు. కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుండీ ఆఫర్లు వచ్చాయి. అవి ఓకే అయితే నేనే చెబుతాను. ఆ ప్రాజెక్టులు సెట్ అయితే నాకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండడు” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus