పాన్ ఇండియా హీరోల కాలంలో… పాన్ ఇండియా హీరోయిన్గా ఎదుగుతున్న కథానాయిక పూజా హెగ్డే. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో తన పోస్టులకు ఏం కొదవ ఉండదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంటుంది. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ తర్వాత తనకొచ్చిన అవార్డుతో ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర చేసింది పూజా హెగ్డే. అందులో స్పెషల్ చీరలో మెరిసిపోయింది పూజ. ఆ అవార్డ్స్ కార్యక్రమం ఫొటోలు, రెడ్ కార్పెట్ ఫొటోల్లోనూ పూజ కట్టుకున్న చీర చాలా స్పెషల్‌గా కనిపించింది.
దీంతో అసలు ఆ చీర ధర ఎంత అనే ఉత్సుకత అభిమానుల్లో మొదలైంది. ఆఫ్ స్క్రీన్ పూజ చీర చాలా అరుదుగా కడుతూ ఉంటుంది. ఆమె సోషల్ మీడియా చూస్తే ఈ విషయం చెప్పొచ్చు. అలాంటిది ఆ చీర కట్టిందంటే ఏదో స్పెషల్ ఉండాల్సిందే కదా. అనుకున్నట్టుగా ఇందులో స్పెషల్ ఉందట. పసుపు రంగు చీర, బంగారు రంగు జాకెట్ తో చూడ్డానికి సింపుల్‌గా కనిపించిన ఆ డ్రెస్ ఖరీదు సుమారు ₹50వేలట.
ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా ఈ స్పెషల్ డ్రెస్‌ను డిజైన్ చేశారట. అంత సాధారణ చీర అంత రేటా అంటే… ఉంటుంది మరి. కొన్ని నెలల కిందట జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లోనూ పూజ హెగ్డే కోసం ఓ లెహంగాలో కనిపించింది. దాని ధర ₹2 లక్షలట. రెగ్యులర్‌గా పూజ వాడే లూయీస్ ఉటాన్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు సుమారు ₹2.5 లక్షలట. ఇప్పుడు ఓకేనా. కాస్ట్లీ డ్రెస్‌లు, యాక్ససెరీస్తో ఆకట్టుకోవడం పూజకు అలవాటే.