Pooja Hegde: 13 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న బ్యూటీ!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నటి పూజాహెగ్డే. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో జత కట్టిన ఈ బుట్టబొమ్మ త్వరలోనే ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తూ కనిపించనుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంటూ తనకున్న క్రేజ్ ను నిరూపించుకుంటుంది.

కొన్నాళ్ల క్రితం పూజాహెగ్డే అకౌంట్ లో సమంతని టార్గెట్ ను చేస్తూ కొన్ని కామెంట్స్ కనిపించాయి. సమంత పెద్దగా క్యూట్ గా ఉండదంటూ పూజాహెగ్డే కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే ఆ తరువాత తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ సమంత ఫ్యాన్స్ మాత్రం పూజాపై మండిపడ్డారు. అప్పటినుండి సమంత, పూజాహెగ్డేల మధ్య పోలిక పెడుతూ ఏదొక పోస్ట్ పెడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫాలోవర్స్ సంఖ్య దగ్గరగా ఉంటుంది.

గత నెలలో సమంత 13 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇప్పుడు పూజాహెగ్డే ఆ ఫీట్ ను అందుకుంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 13 మిలియన్ ఫాలోవర్లను రీచ్ అవ్వడంతో పూజా తెగ సంతోషపడుతోంది. తన అభిమానులు, ఫాలోవర్లందరికీ ముద్దులు, హగ్గులు ఇస్తోంది. వర్చువల్ హగ్స్ అంటూ ఎమోజీలను పోస్ట్ చేసింది. అంతేకాదు.. ఓ క్యూట్ ఫోటోను కూడా షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రాధేశ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఆచార్య’ లాంటి చిత్రాలలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు కమిటైంది!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus