Pooja Hegde: ప్రభాస్ తో మరో మూవీపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సాధించడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు 90 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్ అటు ప్రభాస్ పై కానీ ఇటు పూజా హెగ్డేపై కానీ పెద్దగా పడలేదు. ప్రభాస్, పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ పై తాజాగా పూజా హెగ్డే స్పందించారు.

Click Here To Watch NEW Trailer

వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్న పూజా హెగ్డేకు రాధేశ్యామ్ ఫ్లాప్ తో గోల్డెన్ హ్యాండ్ ఇమేజ్ పోయింది. అయితే రాధేశ్యామ్ సినిమాను చూసిన తర్వాత తనను అందరూ ప్రేరణ అని పిలుస్తున్నారని తన నటన విషయంలో ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తం కాలేదని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. క్రిటిక్స్ సైతం తనను, తన పాత్రను ప్రశంసించారని పూజా హెగ్డే కామెంట్లు చేశారు.రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఉంటుందని పూజా హెగ్డే అభిప్రాయపడ్డారు.

కొన్నిసార్లు సినిమాలకు ఫ్లాప్ లేదా యావరేజ్ టాక్ వచ్చినా కళ్లు చెదిరే కలెక్షన్లు సొంతమవుతాయని పూజ హెగ్డే పేర్కొన్నారు. మరి కొన్నిసార్లు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా కలెక్షన్లు లేక ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయని పూజా హెగ్డే అభిప్రాయపడ్డారు. విధిరాతే దీనంతటికీ కారణమని ఆమె అన్నారు. ప్రతి మూవీకి సొంత విధి ఉంటుందని పూజా హెగ్డే వెల్లడించడం గమనార్హం. రాధేశ్యామ్ రిజల్ట్ కు విధిరాతే కారణమని పూజా హెగ్డే పేర్కొన్నారు.

ప్రభాస్ తో మరో సినిమా గురించి పూజా హెగ్డేకు ప్రశ్న ఎదురుకాగా ప్రభాస్ తో మరో సినిమా చేయాలని ఆశిద్దామని అతనికి ప్రస్తుతం భారీ లైనప్ ఉంది కాబట్టి ప్రభాస్ సినిమాలో నటించడానికి కొంత సమయం పట్టవచ్చని పూజా హెగ్డే అన్నారు. రాధేశ్యామ్ గురించి, ప్రభాస్ గురించి పూజా హెగ్డే చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus