అడ్డంగా బుక్కైపోయిన పూజా హెగ్డే.. ట్రోలింగ్ షురూ..!

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. పెద్ద పెద్ద సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ పూజా హెగ్డే నే..! అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ కూడా ఈమెనే..! తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈమె పారితోషికం నచ్చితేనే ప్రాజెక్టులకు సైన్ చేస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా నిర్మాతలు అందరి నటీనటుల పారితోషికాలను తగ్గించుకోమని విన్నపించుకుంటున్నారు. కానీ పూజా హెగ్డే ను మాత్రం ఇబ్బంది పెట్టడం లేదట.

ఇంతలా సౌత్ సినిమా ఆమెకు అన్ని సౌకర్యాలు ఇస్తుంటే.. ఆమె మాత్రం బాలీవుడ్ పై మోజుతో అనుకుంట సౌత్ సినిమాను చిన్న చూపు చూస్తుంది. ఈ విషయాలు నేను చెప్తున్నవి కాదు.. సోషల్ మీడియాలో నెటిజన్లు పలుకుతున్నవి. అంతలా పూజ వారిని ఏమంది అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.! ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ.. ‘సౌత్ ఇండియన్ సినిమా వాళ్ళు అంతా నావెల్(నడుము) పిచ్చోళ్ళు. ఆ మత్తులోనే ఉంటారు’ అంటూ కామెంట్ చేసింది.

నిజానికి ఆమె నవ్వుతూనే కామెంట్ చేసింది. కానీ అది చాలా సీరియస్ అయ్యింది. ‘ఓ క్రేజ్ వచ్చిన తరువాత సౌత్ సినిమా అంత తక్కువగా కనిపిస్తుందా’ అంటూ నెటిజన్లు ఆమె పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus