హిరణ్యకశ్యపలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ

  • December 28, 2020 / 08:51 PM IST

ప్రస్తుతం పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్ మాములుగా లేదు. తెలుగులో ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ తో సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి బడా ఖాన్ సరసన ఆఫర్ కొట్టేసింది. ఒకప్పుడు రకుల్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా సాధించలేకపోయిన క్రేజ్ & స్టార్ డమ్ ఇప్పుడు ఇప్పుడు పూజా చేతిలో ఉంది అని చెప్పొచ్చు. తెలుగులో ఆమె రెమ్యునరేషన్ రెండున్నర కోట్లకు పైనే, హిందీలో అయిదారు కోట్ల వరకు వసూల్ చేస్తోంది.

బడా హీరోలు, నిర్మాతలు తప్ప ఆమెతో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గుణశేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కునున్న “హిరణ్యకశ్యప”లో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి గుణశేఖర్ తన సినిమాకి పెట్టుకున్న బడ్జెట్ లిమిటేషన్స్ కు పూజా హెగ్డేను హీరోయిన్ గా పెట్టుకోవడం అనేది పెద్ద టాస్క్. అయితే.. సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయాలంటే రానా ఒక్కడి ఇమేజ్సరిపోదు కాబట్టి గుణశేఖర్ ఈ నిర్ణయం తీసుకొన్నాడు.

పెళ్లి అనంతరం మళ్ళీ సినిమాల మీద పూర్తి స్థాయిలో కాన్సన్ ట్రేషన్ పెడుతున్న రానా కూడా తన సినిమా స్థాయి పెరగాలంటే పూజా కంపల్సరీ అని భావించి ప్రొడక్షన్ బడ్జెట్ ను కాస్త కంట్రోల్ చేసి.. ఆ డబ్బులు పూజా రెమ్యునరేషన్ వైపు మళ్ళించాడు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus