లారెన్స్ ను కోసం వచ్చి భిక్షమెత్తుకోవడమేంటి?

స్టార్ కొరియోగ్రాఫర్, మాస్ దర్శకుడు, మంచి నటుడు ఇవన్నీ కలిపితే రాఘవ లారెన్స్. ఈయన ఎన్నో హిట్టు సినిమాలను డైరెక్ట్ చేశాడు. నాగార్జున, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసాడు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు లారెన్స్. తన ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేయించి.. ఎంతో మందికి ప్రాణం పోసిన ఘనత లారెన్స్ కు చెందుతుంది. అయితే ఓ కుటుంభం లారెన్స్ ను కలవడానికని వచ్చి భిక్షమెత్తుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎగ్మూర్ రైల్వేస్టేషన్ లో ఓ కుటుంభం లారెన్సు ను కలవడానికి వచ్చి భిక్షమెత్తుకొని బతుకుతున్నారట.

అసలు విషయం ఏంటంటే.. రాజపాళైయంకి చెందిన మహిళ గృహలక్ష్మికి… గురు సూర్య అనే కొడుకున్నాడు. రెండేళ్ళ వయసు వరకూ గురు సూర్య నడవలేకపోవడంతో ఆ తల్లి విలవిలలాడిపోయింది. కనీసం మాటలు కుడా రాలేదు. ఆ తరువాత కొంతకాలానికి… ఆ పిల్లాడు గుండెజబ్బుతో బాధపడుతున్నట్టు తెలిసింది. తన కొడుకుని కాపాడుకోవడానికి.. ఆ తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది. భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో గృహలక్ష్మికి తన సోదరుడు వెంకటేశన్ అండగా నిలిచాడు. ఈ క్రమంలో ఎవరో చెన్నైకి వెళ్ళి నటుడు లారెన్స్ ను కలవమని సలహా ఇచ్చారంటూ ఆమెతో చెప్పాడు. వెంటనే గృహలక్ష్మి వారం రోజుల క్రితం కొడుకు, సోదరుడిని తీసుకొని లారెన్స్ ని కలవడానికి చెన్నైకి వచ్చింది. కానీ వారికి లారెన్స్ అడ్రెస్ దొరకకపోవడం… తిరిగి ఊరికి వెళ్ళలేకపోవడంతో ఆమె సతమతమవుతుంది. తన కొడుకుని రక్షించుకోలేకపోతున్నాననే బాద మరోవైపు… ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో…. చెన్నై, ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లోనే ఉండిపోయి… ప్రయాణికులు వేస్తోన్న భిక్షంతో పొట్టనింపుకుని… అక్కడే ఉండిపోయారు. ఈ పరిస్థితిలో వారిని ఎవరైనా ఆదుకుంటారేమోనాని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని ఎలాగైనా లారెన్స్ వరకూ తీసుకువెళ్ళాలని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus