ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి రెండు రోజుల క్రితం తన ఆస్తుల గురించి, ఇతర విషయాల గురించి షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోసాని మరోమారు నారా లోకేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. తాను చనిపోతే లోకేష్ దే బాధ్యత అని పోసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. నన్ను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు.
మంగళగిరి కోర్టుకు హాజరయ్యే సమయంలో నన్ను చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని పోసాని చెప్పుకొచ్చారు. తాను కూడా కేసు పెట్టగలనని లోకేశ్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని పోసాని ప్రశ్నించడం గమనార్హం. లోకేష్ ఇష్టానుసారం కామెంట్లు చేస్తే నేను పరువు నష్టం దావా వేయకూడదా? అని పోసాని ప్రశ్నించడం గమనార్హం. పోసాని చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
పోసాని (Posani) కామెంట్ల గురించి ఇతర పార్టీల నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. పోసానిపై లోకేశ్ పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో పోసాని ఈ కామెంట్లు చేశారు. పోసాని ప్రస్తుతం సినిమాలకు సైతం దూరంగా ఉన్నారు. పోసాని కృష్ణమురళి వైసీపీ తరపున ప్రస్తుతం పదవిలో ఉన్నారు. పోసాని వివాదాలకు దూరంగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
పోసాని కృష్ణమురళి తాను భార్య పేరుపై 50 కోట్ల రూపాయల ఆస్తులు రాశానని, పిల్లల పేర్లపై కూడా ఆస్తులు రాశానని తాజాగా చెప్పుకొచ్చారు. పోసాని కృష్ణమురళి ఎన్నికల్లో పోటీపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. పోసాని కృష్ణమురళి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. తనపై వచ్చిన విమర్శల గురించి పోసాని ధీటుగా స్పందిస్తూ ఆ వార్తలకు చెక్ పెడుతున్నారు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్