మీ ఇంట్లో వాచ్ మెన్ శవం ఉంటే ఏం చేసావ్.. బాలయ్య పై పోసాని ఫైర్!

నటుడు నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ నటుడు బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది..అయితే ఈ విషయంలో బాలకృష్ణ జైలుకు వెళ్లకుండా ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని వైద్యులు తెలియజేయడంతోనే మానసిక పరిస్థితి బాగాలేక పోవటం వల్లే ఇలా కాల్పులు జరిపారు అంటూ ఆయనపై ఏ విధమైనటువంటి కేసులు కూడా లేవు.

ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి పోసాని మాట్లాడుతూ… బాలకృష్ణ తన తుపాకీతో ఇద్దరిని కాల్చి వేశారు. ఎవరైనా మంచివాళ్లు మానసిక స్థితి బాగున్నవారు అలా చేస్తారా? లేక సైకోలు చేస్తారా? చేతిలో గన్ ఉంది కదా అని ఇద్దర్ని కాల్చిన తర్వాత జైలుకు వెళ్లారా అంటే అది లేదు. అదే నేను ఎవరైనా ఇద్దరిని కాలిస్తే పోసాని అమాయకుడని నన్ను వదిలేస్తారా? అని ప్రశ్నించారు.

నేను నీలా ఇద్దరినీ కాల్చివేస్తే తనని తీసుకెళ్లి జైల్లో పెడతారు. మరి నువ్వు ఇద్దరినీ కాల్చిన నిన్ను ఎవరు ఏమి చేయలేకపోయారు ఇక్కడ మానసిక రోగి ఎవరు? సైకో ఎవరు అనేది అందరికీ తెలిసిపోతుందని ఈయన తెలియజేశారు. ఇక మీ ఇంట్లో ఓ రోజు రాత్రి నీ కళ్ళముందే వాచ్మెన్ చనిపోయారు నువ్వు ఏం చేసావ్… మరుసటి రోజు ఉదయం తన శవాన్ని దాటుకుని షూటింగ్ కి వెళ్లిపోయావు అంటూ ఈయన షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ఈ విధంగా నీ జీవితంలో జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా తెలిస్తే సైకో ఎవరు అనే విషయం అందరికీ తెలిసిపోతుందని ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా పోసాని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus