Posani: వైరల్ అవుతున్న పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు!

పోసాని కృష్ణమురళి ఈ మధ్య కాలంలో ఇతర పార్టీల నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. పురంధేశ్వరి, బాలయ్య టార్గెట్ గా పోసాని తాజాగా తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా ఆ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయిన తర్వాత సీఎం జగన్ ను తిట్టడం మొదలైందని పోసాని అన్నారు. పురంధేశ్వరికి చంద్రబాబు బంధువు కాబట్టే చంద్రబాబు దుర్మార్గుడు అయినా కక్షగట్టి బాబును అరెస్ట్ చేసినట్టు ఆమె మాట్లాడుతోందని పోసాని తెలిపారు.

చంద్రబాబు తన పదవి కోసం సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని పోసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని స్వయంగా మోదీ చెప్పారని పోసాని కామెంట్లు చేశారు. ఈ విషయం పురందేశ్వరికి తెలియదా అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మధ్యపాన నిషేధాన్ని ఎత్తేశారని పోసాని అన్నారు.

ఆ సమయంలో పురంధేశ్వరి ఎందుకు ప్రశ్నించలేదని ఆయన కామెంట్లు చేశారు. బాలకృష్ణ ఇద్దరిని పిట్టలను కాల్చినట్టు కాల్చాడని పురంధేశ్వరి వేడుకుంటే బాలయ్య కోర్టుకు వెళ్లకుండా వైఎస్సార్ కాపాడారని పోసాని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ లో పురంధేశ్వరి ఎలా చేరారని బీజేపీలో ఓడిపోతే పురంధేశ్వరి మళ్లీ కాంగ్రెస్ లో చేరతారా అని పోసాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీజేపీపై పురంధేశ్వరికి దోమంత అయినా ప్రేమ లేదని పోసాని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిత్యం రాజకీయ పార్టీలు మారే మీకు సీఎం వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లేదని పోసాని పేర్కొన్నారు. పోసాని చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పోసాని సినిమాలకు దూరంగా ఉంటూ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus