‘బ్రో’ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. మధ్యలో కొన్ని కారణాల వల్ల డిలే అయితే నిర్మాత ఏ.ఎం.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి.. సినిమాని పూర్తిచేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేశారు జ్యోతి కృష్ణ. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ట్రైలర్ మంచి హోప్స్ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ చేసిన ప్రమోషన్స్ కూడా.. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరగడానికి సాయపడ్డాయి. మొత్తానికి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కామన్ ఆడియన్స్ ని అలరించే అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) ఔరంగజేబ్(బాబీ డియోల్) పాత్రను పరిచయం చేసిన తీరు.. ఆ పాత్రకు ఇచ్చిన జస్టిఫికేషన్ బాగుంది. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఈ పాత్రను ఎండ్ చేయకుండా.. సెకండ్ పార్ట్ కోసం ఈ పాత్రను ఉంచడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
2) పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్.. ఫైట్ సీక్వెన్స్ మెప్పిస్తాయి. దీనికి కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.
3) చిన్న దొర(సచిన్ కేడెకర్) సంస్థానంలోకి వీరమల్లు అడుగుపెట్టినప్పుడు వచ్చే కుస్తీ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొడగొట్టే సీన్ విజిల్ వర్త్.
4) సెకండాఫ్ లో వచ్చే తోడేలు ట్రాక్… వీరమల్లు వాటి కళ్ళలోకి కళ్ళుపెట్టి భయపెట్టే సీక్వెన్స్ కూడా ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు.
5) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఔరంగజేబ్ మనుషులు అమ్మవారి విగ్రహాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్న టైంలో అమ్మోరు పూనినట్టు వీరమల్లు ఎంట్రీ.. వాళ్ళ పై విరుచుకుపడే సీన్..మొహం పై రక్తంతో వీరమల్లు ‘అమ్మోరు ఇలా వస్తుందిరా’ అంటూ చెప్పే డైలాగ్ వంటివి మంచి హై- ఇస్తాయి.
6) చివర్లో వీరమల్లు ఢిల్లీలో ఎంటర్ అవుతున్న టైంలో హిందువులను ఔరంగజేబ్ మనుషులు వేధించడం.. అక్కడ ధర్మం వీరమల్లు నిలబడితే.. తర్వాత మిగిలిన జనాలు కూడా వచ్చి పోరాడే సీక్వెన్స్ కూడా మెప్పిస్తుంది. అక్కడ వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కూడా బాగా కనెక్ట్ అవుతాం.
7) వీరమల్లు ముస్లిం జనాల ఆకలి దాహం తీర్చి.. ఆ తర్వాత వర్షం కోసం హోమం చేస్తున్న పండితులను ఔరంగజేబ్ సైన్యం నుండి కాపాడే సీన్ కూడా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. సనాతన ధర్మం డెఫినిషన్ ను సింపుల్ గా ఈ సీన్స్ తో చెప్పారనిపిస్తుంది.
8) పవన్ కళ్యాణ్… హరిహర వీరమల్లు పాత్రను బాగా ఓన్ చేసుకుని… ఆ పాత్రకు జీవం పోశారు. అన్ని రకాలుగా పవన్ శ్వాగ్ తోనే ఆడియన్స్ చివరి వరకు థియేటర్లలో కూర్చోగలరు.
9) ఎం.ఎం.ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఆయువుపట్టుగా నిలుస్తుంది. డల్ గా ఉన్న స్క్రీన్ ప్లేని ఆయన సంగీతంతో మ్యానేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన వరకు పూర్తి న్యాయం చేశారు.
10) నిధి అగర్వాల్ పంచమి పాత్రలో బాగా సెట్ అయ్యింది. ఆమె లుక్స్ బాగున్నాయి. కాస్ట్యూమ్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఆమె ఇలాంటి పాత్రలకు కూడా సెట్ అవుతుంది అని మిగతా డైరెక్టర్స్ కి ఓ హోప్ ఇచ్చింది. ‘తార తార’ అనే పాటలో ఈమె గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.