మెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ ఖైదీ నంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన సమయంలో కత్తి సినిమాను రీమేక్ చేయడంపై చాలామంది నుంచి విమర్శలు వినిపించాయి. అప్పటికే కత్తి సినిమాను చాలామంది ప్రేక్షకులు చూసేయడంతో ఖైదీ నంబర్ 150 సినిమాలో చిరంజీవి నటించడం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఖైదీ నంబర్ 150 రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అని కామెంట్లు చేశారు. అయితే సినిమా రిలీజైన తర్వాత అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి.
ఖైదీ నంబర్ 150 రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోవడం గమనార్హం. చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటిస్తానని ప్రకటించిన సమయంలో చాలామంది విమర్శలు చేశారు. గాడ్ ఫాదర్ మూవీ ప్రయోగాత్మక మూవీ అనే సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150 విషయంలో ఏం జరిగిందో గాడ్ ఫాదర్ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గాడ్ ఫాదర్ సెకండ్ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. గాడ్ ఫాదర్ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటంతో పాటు సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే విధంగా ట్రైలర్ ఉండటం గమనార్హం. పరిమిత పాత్రలతోనే ఈ సినిమా తెరకెక్కినా ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ కు నచ్చేలా ఉంది. చిరంజీవి సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ సన్నివేశాలన్నీ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను సత్యదేవ్ అద్భుతంగా పోషించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సినిమాసినిమాకు మెగాస్టార్ చిరంజీవి రేంజ్ పెరుగుతుండగా చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. చిరంజీవి ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.