లండన్ లో పవర్ స్టార్ మేనియా!

ఎస్‌జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుండగా..జూలైలో పవన్ లండన్ వెళ్లనున్నట్లు సమాచారం.

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(యుక్తా) ఆధ్వర్యంలో 6 వ వార్షికోత్సవ వేడుకలు లండన్ ట్రోక్షిలో జూలై 9 న జరగనుండగా.. ఈ వేడుకలకు పవన్ హాజరు కానున్నారట. నిర్వహకుల ఆహ్వానం మేరకు పవన్ ఈ కార్యక్రమానికి హాజరై.. ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పవన్ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో వేసవి సెలవులు గడుపుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus