Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » మహా వైభవంగా… జన సేనాని చేతుల మీదుగా… ‘మహా మ్యాక్స్’ ఛానెల్ ప్రారంభం!

మహా వైభవంగా… జన సేనాని చేతుల మీదుగా… ‘మహా మ్యాక్స్’ ఛానెల్ ప్రారంభం!

  • October 25, 2023 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహా వైభవంగా… జన సేనాని చేతుల మీదుగా… ‘మహా మ్యాక్స్’ ఛానెల్ ప్రారంభం!

గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ‘మహాన్యూస్’. అయితే, ఒకటిన్నర దశాబ్దంగా తెలుగు వార్తా రంగంలో ‘మహా గ్రూప్’ కొనసాగిస్తున్న మహా ప్రస్థానాన్ని… ఇప్పుడు వినోద రంగానికి కూడా విస్తరించింది. మహా న్యూస్ అధినేత మారెళ్ల వంశీ ‘మహా మ్యాక్స్’ పేరుతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని జనం ముందుకు తీసుకు వచ్చారు. తెలుగు వారి లోగిళ్లలోని ఈ నవ్యమైన వినోదాల విప్లవం… ‘మహా మ్యాక్స్’ని… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ప్రారంభించారు.

హైద్రాబాద్ ఫిల్మ్ నగర్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ లో మహా మ్యాక్స్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 24న మహా వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ‘మహా గ్రూప్’ ఉద్యోగులు, సినీ, రాజకీయ, వాణిజ్య, వ్యాపార సంస్థల ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్లొన్న ఈ కార్యక్రమంలో సినీ, సాంస్కృతి, భక్తి నేపథ్యంలో పలు ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన పవన్ కళ్యాణ్‌ ‘మహా మ్యాక్స్’కు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. ఛానల్ లోగోని లాంచ్ చేసిన ఆయన `వివాదాలను కాకుండా కళను ప్రోత్సహించేందుకు ప్రయత్నించా’లంటూ హితవు పలికారు. సినిమా రంగంలోని సెలబ్రిటీలు ‘సాఫ్ట్ టార్గెట్స్’ అవుతుంటారనీ పవన్ చెప్పారు.

అటువంటి వారికి మహా మ్యాక్స్ అండగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. “చిత్ర పరిశ్రమని టీఆర్పీలకు వాడుకోవటం మాత్రమే కాకుండా సినీ రంగంలోని సమస్యలపై దృష్టి పెట్టా”లని ఆయన కోరారు. రఘుపతి వెంకయ్య నాయుడు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి అలనాటి మహానుభావులపై కూడా మీడియా దృష్టి సారించాలని పవన్ అన్నారు. ఈ తరం వారికి అప్పటి తరం సినీ లెజెండ్స్ తాలూకు గొప్పతనం తెలపాల్సిన బాధ్యత మహా మ్యాక్స్ పై ఉందని పవర్ స్టార్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మహా మ్యాక్స్ ప్రారంభోత్సవ వేళ మహా ఎండీ వంశీ ఛానెల్ లక్ష్యాన్ని తెలియచేశారు. మొదట తాను ఎంటర్టైన్మెంట్ చానల్ పెట్టాలని భావించినప్పుడు ఒకింత వెనకడుగు వేశానని ఆయన అన్నారు. కానీ, పవన్ కళ్యాణ్ తనను వెన్నుతట్టి ప్రోత్సహించారని వివరించారు. సినీ పరిశ్రమకి సైతం ఒక కొత్త వినోదాల వేదిక అవసరం ఎంతైనా ఉందని పవర్ స్టార్ అన్నట్టు వంశీ చెప్పారు. జనసేనాని అందించిన ప్రొత్సాహంతోనే తాను మహా మ్యాక్స్ విజయవంతంగా జనం ముందుకు తెచ్చానని కరతాళ ధ్వనుల మధ్య ఆయన ప్రకటించారు.

ప్రతీ సినిమాకు క్లాప్ నుంచీ సెలబ్రేషన్ వరకూ హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ అందిస్తామని మహా గ్రూప్ అధినేత హామీ ఇచ్చారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా తమకు ఉండదని స్పష్టం చేశారు. వెబ్ సిరీస్ లు, టాలెంట్ హంట్స్ ద్వారా కొత్త ప్రతిభని మహా మ్యాక్స్ వెలికి తీస్తుందని వంశీ హామీ ఇచ్చారు. మహా మ్యాక్స్ లాంచ్ ఈవెంట్లో పద్మశ్రీ అవార్డ్ గ్రహీత విజేయంద్ర ప్రసాద్ సైతం పాల్గొన్నారు. ఆయన నూతన ఛానల్ కి, టీమ్ కి ఆశీస్సుల్ని అందించారు.

సీనియర్ నటులు మురళీమోహన్ పరిశ్రమ గురించి ప్రస్తావిస్తూ.. అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. అటువంటి అరుదైన సందర్భాలను టాలీవుడ్ లో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. మహా మ్యాక్స్ ఇక పై సినీ పరిశ్రమ గర్వించే అంశాలు ఏవైనా ఉంటే ఘనంగా సెలబ్రేట్ చేయాలని సూచించారు. దానిపై సానుకూలంగా స్పందించిన మహా మ్యాక్స్ ఎండీ వంశీ అదే వేదికపై జాతీయ అవార్డు గ్రహీత, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ను సన్మానించారు. మురళీ మోహన్, యువ దర్శకుడు వశిష్ఠ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు.

స్టార్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు మహా మ్యాక్స్ కి పరిశ్రమ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని సభా ముఖంగా హామీ ఇచ్చారు. ‘బేబి’ చిత్రంతో కల్ట్ సక్సెస్ ని అందుకున్న నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, ‘మహా మాక్స్… హయ్యెస్ట్ టాక్స్ పేయర్ ఛానెల్ గా ఎదుగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. సీనియర్ నిర్మాత అశ్వనీదత్ మహా మ్యాక్స్ బృందానికి శుభాశీస్సులు అందించారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఈవెంట్ ను శ్రేయాస్ మీడియా సంస్థ ఆర్గనైజ్ చేసింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

trending news

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

30 mins ago
Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

4 hours ago
పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

4 hours ago
OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

7 hours ago
Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

10 hours ago

latest news

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

4 hours ago
పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

4 hours ago
Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

4 hours ago
OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

4 hours ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version