బుల్లితెడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాకర్ ఒకరు. ఈయన బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకునే ప్రస్తుతం వరుస సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈయన భార్య మలయజ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కూడా పలు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ప్రభాకర్ తన భార్యతో కలిసి బుల్లితెర కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇందులో భాగంగా తన ప్రేమ పెళ్లి గురించి పలు విషయాలను వెల్లడించారు. ఇక వీరిద్దరి పెళ్లి ఫోటో స్క్రీన్ పై డిస్ప్లే కావడంతో ప్రభాకర్ తన పెళ్లి గురించి మాట్లాడారు. ఇది మా దొంగ పెళ్లి అని మేము ప్రేమించుకుని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మా ఫ్రెండ్ ఒకడు కాళ్లు కడిగి కన్యదానం చేశారని ప్రభాకర్ తెలిపారు. ఇక పెళ్లి తర్వాత నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఆ విషయం తెలిసి తన భార్య చాలా బాధపడిందని ప్రభాకర్ తెలిపారు.
అయితే నేను (Prabhakar) తనకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడంతో ఆమె తనను క్షమించిందని అయితే ఇలాంటి విషయాలలో సారీ చెప్పడం గొప్ప కాదు కానీ ఆ సారీ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే క్షమించడం గొప్పతనం అంటూ భార్య గురించి అలాగే తన పెళ్లి గురించి ప్రభాకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి రాకముందే యాటిట్యూడ్ సార్ గా పేరు సంపాదించుకున్నారు ప్రస్తుతం చంద్రహాస్ పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!