‘ప్రభాస్ 20’ లేటెస్ట్ అప్డేట్..!
- March 20, 2019 / 11:18 AM ISTByFilmy Focus
ఓ పక్క ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ చిత్రం చేస్తున్నప్పుడే ,మరోపక్క ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో తన 20 వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టేసాడు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ‘సాహో’ చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల చేసే దిశగా శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు చిత్ర బృందం. ఇక ‘ప్రభాస్20’ ఇప్పటికే యూరప్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం మరో షెడ్యూల్… ఇదే వారంలో మొదలుకానుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.
- వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెస్సీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి టీజర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!
వివరాల్లోకి వెళితే ‘ప్రభాస్ 20’ మార్చి 21 నుండీ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్ లో భాగంగా… దాదాపు 15 రోజుల పాటూ కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ప్రత్యేకంగా దీనికోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆర్.రవీందర్‌ను తీసుకున్నారట. ఈ సీన్ కోసం వేసే సెట్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తుందట. పిరియాడికల్ డ్రామా గా తెరకెక్కుతోన్న చిత్రం కాబట్టి సెట్స్ చాలా అవసరం. కథ డిమాండ్ చేయడం వలనే ఈ సెట్స్‌ని వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే యూరప్‌లో జరిగే మరో షెడ్యూల్ కి కూడా కొన్ని సెట్స్ వేయబోతున్నట్టు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2020 సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.













