‘ప్రభాస్21’ స్టోరీ అది కాదట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో తన 20వ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు కానీ.. 30 శాతం షూటింగ్ అయితే పూర్తయ్యింది. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి గాను ప్రభాస్ కు 70 కోట్ల పారితోషికాన్ని… అశ్వినీదత్ ఆఫర్ చేసినట్టు టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కథ ఇదేనంటూ గత కొన్ని రోజులుగా.. ఎన్నో కథనాలు పుట్టుకొస్తున్నాయి. వాటి ప్రకారం.. ‘ఓ దేవకన్యకు అలాగే సామాన్య మానవుడికి పుట్టిన బిడ్డ ప్రభాస్ అని.. అతనికి సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయని’ ప్రచారం నడిచింది. దాంతో ‘ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి సీక్వెల్’ అంటూ వైరల్ అయిపొయింది. అయితే ఆ కథలో నిజం లేదు అనేది తాజా సమాచారం. ఈ చిత్రం కథ పూర్తిగా ‘దేవుడు వెర్సస్ సైన్స్’ అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంద‌ట‌.

దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వచ్చిన ప్రతీసారి సైంటిస్ట్ లు లేరు అనే ఎక్కువగా చెబుతుంటారు. అలాంటి టాపిక్ తోనే ఈ సినిమా కథ ఉంటుందట.’చివరకు లాజికల్ గా దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసి సైంటిస్ట్ లను మార్చే’ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది.ఇది పూర్తిగా సైన్స్ ఫిక్షన్ మూవీ అనే తెలుస్తుంది. ఫైట్స్ కు ఈ చిత్రంలో ఎక్కువ స్కోప్ ఉండకపోవచ్చట. పూర్తిగా యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్.. మాత్రమే ఉంటాయని కూడా టాక్ వినిపిస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus