భాగమతి టీజర్ పై ప్రభాస్ కామెంట్!

స్వీటీ అనుష్క ఏ పాత్ర చేసినా.. ఆ క్యారక్టర్ పేరు అందరి నోటా మారుమోగాల్సిందే. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన.. ఈ పేర్లు చెప్పగానే అనుష్క గుర్తొకొస్తుంది. ఈ పేర్ల జాబితాలో మరొకటి యాడ్ కానుంది. అదే భాగమతి. బాహుబలి సినిమాల తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమాని పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించిన ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక పాడు బడిన బంగ్లాలోకి పరిగెత్తుతున్న యువతి.. ఆ యువతీ తనచేతిలో సొంతంగా మేకు కొట్టుకునే షాట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ టీజర్ సినిమాపై అంచనాలను వందశాతం పెంచింది. ఈ టీజర్ ని చూసిన ప్రభాస్ సోషల్ మీడియా వేదికపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

” ప్రతి చిత్రంలోనూ కొత్తగా కనిపించడంలో, అటువంటి పాత్రలను ఎంచుకోవడంలో అనుష్క ఎప్పుడూ ముందు ఉంటుంది. అనుష్క తో పాటు భాగమతి చిత్ర బృందాన్ని గుడ్ లక్” అని పోస్ట్ చేశారు.  భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం వచ్చే నెల థియేటర్లోకి రానుంది. ఇక ప్రభాస్ బాహుబలి తర్వాత సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. దీని తర్వాత దుబాయి అవుట్ కట్స్ లోని కొండల్లో భారీ యాక్షన్ సీన్ తీయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus