Prabhas: పెళ్లి విషయంలో ప్రభాస్ మాటలు.. అభిమానులకే నమ్మకం లేదా?

‘ప్రభాస్ పెళ్లి’ అనే టాఫిక్ 2009 నుండి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తన తర్వాత వచ్చిన హీరోలంతా ఆల్రెడీ పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ మాత్రం 12 ఏళ్ల నుంచి ఎప్పుడూ ఒకటే మాట చెబుతున్నాడు. అభిమానులు కూడా ఈ విషయంలో అలసిపోయారు అనే చెప్పాలి. కృష్ణంరాజు ఉన్నన్ని రోజులు ఆయన ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒకటి చెబుతూ మేనేజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన లేరు.

కాబట్టి.. ప్రభాస్ ఎదురైతే దీని గురించి కచ్చితంగా ప్రభాస్ స్పందించాల్సిందే. బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోకి వెళ్ళినప్పుడు బాలయ్య ప్రభాస్ పెళ్లి గురించి అడిగితే.. ‘నేను సల్మాన్ ఖాన్ తర్వాత అని చెప్పాలేమో’ అని ఓ మాట అనేశాడు. సో ప్రభాస్ కి పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదు అని అక్కడే తేలిపోయింది. అయినా మొన్న ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ గోల చేస్తే ‘ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటాను’ అంటూ ఓ మాట అనేశాడు.

ఇది అభిమానులను కంట్రోల్ చేయడానికి తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అయినా ఆ వార్త వైరల్ అవుతుంది. కొంతమంది హ్యాపీగా ఉన్నారు. కానీ ఇదే విషయం పై ప్రభాస్ ఇంట్లోవాళ్ళు అతన్ని ఆరాతీయగా.. ‘ఏదో చెప్పాలి కదా.. అందుకే అలా చెప్పను’ అన్నట్టుగా సమాధానం ఇచ్చాడని సమాచారం. ప్రభాస్ పెద్ద సినిమాలు చేస్తున్నా .. అభిమానులకి ఆ ఆనందం లేదు.

ఎందుకంటే ప్రభాస్ కి (Prabhas) లాయల్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు.అందుకే అతని పర్సనల్ లైఫ్ కూడా బాగుండాలి..’అతను పెళ్లి చేసుకోవాలి’ అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఏదో ఒక మాట చెప్పి దాటేస్తున్నాడు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus