‘రాజు’’గారూ… కొత్త కథ ఎంచుకోకపోయారా?

‘సలార్‌’ సినిమా మొదలైనప్పటి నుండి సినిమా కథ విషయంలో రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ప్రశాంత్‌ నీల్‌ తొలిసారిగా దర్శకత్వం వహించిన కన్నడ సినిమా ‘ఉగ్రమ్‌’కు ఇది రీమేక్‌ అని వార్తలొచ్చాయి. దీనిపై ప్రశాంత్‌ స్పందించి క్లారిటీ ఇచ్చినా.. ఆగలేదు. ఇప్పుడు మరో పుకారు మొదలైంది. అయితే ఇది రీమేక్‌ పుకారు కాదు.. వేరేది. దీంతో మరోసారి సినిమా చర్చల్లోకి వచ్చింది. మరి దీనిపై కూడా ప్రశాంత్‌ నీల్‌ స్పందించి ఓ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

‘కేజీఎఫ్‌’తో పాటే ‘సలార్‌’ కథను కూడా ప్రశాంత్‌ నీల్‌ సిద్ధం చేసుకున్నాడని తాజా సమాచారం. యశ్‌కు ‘కేజీఎఫ్‌’ కథ చెప్పినప్పుడే, ‘సలార్‌’ కథ కూడా చెప్పాడట. రెండింటిలో ‘కేజీఎఫ్‌’ కథ బాగా నచ్చడంతో యశ్‌ ఆ సినిమాకు ఓకే చేశాడు. ఆ తర్వాత చర్చల్లో ఆ సినిమా రెండు భాగాలుగా మారింది. తొలి భాగం ఎంత విజయం సాధించిందో మీకు తెలిసిందో. ఇప్పుడు అంతే స్థాయిలో ‘కేజీఎఫ్‌ 2’ ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తోంది.

ఈ పుకార్ల బట్టి చూస్తే… అప్పుడు యశ్‌ని అంతగా ఇంప్రెస్‌ చేయలేకపోయిన కథను ఇప్పుడు ప్రభాస్‌ చేస్తున్నాడన్నమాట. అయితే అప్పటి ‘సలార్‌’కి ఇప్పటికి ‘సలార్‌’కి చాలా తేడా ఉందని కూడా వార్తలొస్తున్నాయి. ప్రభాస్‌ ఇటీవల కాలంలో సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నాడట. పాన్‌ ఇండియా ఇమేజ్‌ రావడంతో అతనిలో ఈ మార్పు వచ్చిందట. ఈ నేపథ్యంలో ‘సలార్‌’ కథను ఎంతో జాగ్రత్తగా ఎంచుకునే ఉంటాడు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus