Prabhas: ప్రభాస్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి.. కారణం అదేనట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో మంచి స్పీడు మీద ఉన్న సంగతి తెలిసిందే. ‘రాధే శ్యామ్’ చిత్రం తుది దశలో ఉండగానే ‘ఆదిపురుష్’ ‘సలార్’ వంటి చిత్రాలను మొదలుపెట్టాడు ప్రభాస్. రెండు సినిమాలను ప్యారలల్ గా ఫినిష్ చేసెయ్యాలనే ఉద్దేశంతోనే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రభాస్ స్పీడుకి కరోనా సెకండ్ వేవ్ బ్రేకులు వేసినట్టు స్పష్టమవుతుంది.వివరాల్లోకి వెళితే.. ‘ఆదిపురుష్’ షూటింగ్ ఆగిపోయిందనేది తాజా సమాచారం. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్లను, సీరియల్ షూటింగ్లను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట.

దాంతో ముంబైలో జరుగుతున్న ‘ఆదిపురుష్’ షూటింగ్ ను నిలిపివేయాలని దర్శకనిర్మాతలు డిసైడ్ అయ్యారట. ‘ఆదిపురుష్’ చిత్రం హై లెవెల్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందనుంది. బ్లూ-మాట్ మరియు గ్రీన్-మాట్ లలో సెట్లు వేసి చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు.తానాజీ ఫేమ్ ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ‘ఆదిపురుష్’ మూవీ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. కృతి సనన్ సీతగా కనిపించనుంది. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించబోతున్నారు.

హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడంతో కలిపి మొత్తం 5 భాషల్లో రూపొందుతోంది. ‘టి సిరీస్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus