వైరల్ అవుతున్న ప్రభాస్, నాని, దుల్కర్, అమితాబ్ ల లేటెస్ట్ ఫోటో..!

ప్రభాస్, ప్రశాంత్, నీల్, బిగ్ బి అమితాబ్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నేచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్, దర్శకుడు నాగ్ అశ్విన్ లు కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో వెనుక ఉన్న కథేంటి? అసలు వీళ్ళు ఎందుకు ఒకే చోట గేధర్ అయ్యారు? అనే డిస్కషన్లు సోషల్ మీడియాలో జోరుగా మొదలయ్యాయి. అయితే మేటర్ ఏంటంటే.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు కె’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ కోసం నిర్మాత అశ్వినీ దత్ హైదరాబాద్లోని గచ్చిబౌలి లో ఓ కొత్త ఆఫీస్ ని తీసుకున్నారు. దీని ప్రారంభోత్సవ వేడుకకు ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. వీరితో పాటు ‘ప్రాజెక్టు కె’ లో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.

ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది అని స్పష్టమవుతుంది. ఇక ప్రాజెక్టు కె చిత్రం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం కోసం ఆమెకు రూ.15 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు భోగట్టా.

ఇక ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది అంటున్నారు. ఈ విషయం పై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ఎంపికయ్యాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus