స్పీడ్ పెంచనున్న ప్రభాస్

  • July 12, 2016 / 01:39 PM IST

మూడేళ్లుగా ఒకే సినిమా కోసం అంకితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన వేగాన్ని పెంచనున్నారు. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ షూటింగ్లో బిజీగా ఉన్నడార్లింగ్.. తన తర్వాతి సినిమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయినా వెంటనే రన్ రాజా రన్ చిత్ర దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. బాహుబలి తో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఏకకాలంలో తెలుగు తమిళ్ భాషల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసే యోచనలో ఉన్నారు. వంద కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ తార అమీ జాక్సన్ ప్రభాస్ పక్కన నటించనుంది.  ఈ మూవీ తర్వాత చేసే ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

‘జిల్‌’ దర్శకుడు కె.రాధాకృష్ణ చెప్పిన కథ నచ్చడంతో రెబల్ స్టార్ పచ్చజెండా ఒప్పారు. సుజీత్ సినిమా పూర్తి అయినా వెంటనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళుతుందా ? లేదంటే రెండు సినిమాలను ఒకే టైంలో పూర్తి చేస్తారా ? అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్ వారే నిర్మించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus