Prabhas: ప్రభాస్ సంపాదన ఎంతంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు (Prabhas) ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఇప్పటికే సొంతం చేసుకున్న ఆయన.. రోజురోజుకు తన ఫ్యాన్స్ ను పెంచుకుంటున్నారు. వరుస సినిమాలతో వేరే లెవెల్ లో అలరిస్తున్నారు. ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. వర్షం (Varsham) , ఛత్రపతి(Chatrapathi)  సినిమాలతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. డార్లింగ్‌ (Darling)  , మిస్టర్ పర్ఫెక్ట్‌ (Mr. Perfect) వంటి సినిమాలతో అమ్మాయిలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Prabhas

బాహుబలి (Baahubali) మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో వచ్చారు. సలార్ 2 (Salaar) , కల్కి 2తో  (Kalki 2898 AD) పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయనున్నారు. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ (The Rajasaab) మూవీని ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్‌ గా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌ లో మూవీ స్టార్ట్ చేశారు. అయితే దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే తొలి హీరోగా ప్రభాస్ ఇప్పటికే నిలిచారు.

ఇక గత పదేళ్లలో ప్రభాస్ నేమ్.. ఫేమ్ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పాలి. అదే సమయంలో ఆయన ఆస్తుల వాల్యూ కూడా పెరిగింది. లగ్జరీ లైఫ్ స్టైల్‌ తో పాటు ఖరీదైన ఇళ్లు, కార్లు ప్రభాస్ సొంతం. నటుడిగా, ప్రభాస్‌ కు ప్రధాన ఆదాయ వనరు సినిమాలే. రెమ్యూనరేషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తుంటారు. అలా ఇప్పటి వరకు ప్రభాస్ నికర ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైమాటేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.

హైదరబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రభాస్ ఇంటి విలువ రూ. 70 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఆ ఇంటిలో విలాసవంతమైన ఇంటీరియర్స్‌ తో పాటు ఇండోర్ స్విమ్మింగ్ పూల్, గార్డెన్, హైఎండ్ జిమ్ ఉన్నాయని టాక్. ముంబైలో ఇటీవల ఆయన కొన్న ఇల్లు విలువ రూ.15 కోట్లు అని సినీ వర్గాల్లో టాక్. ఇటలీలోని కూడా ప్రభాస్ కు ఓ విలాసవంతమైన ఫ్లాట్ ఉందని, దాని వాల్యూ కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. వీటితోపాటు ఆయన వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయి.

కార్లంటే ఎంతో ఇష్టమైన ప్రభాస్ గ్యారేజీలో వేరే లెవెల్ వెహికల్స్ ఉన్నాయట. రూ. 7 కోట్ల విలువ చేసే లంబోర్ఘిని, రూ. 2 కోట్ల విలువైన బీఎమ్‌ డబ్ల్యూ 7 సిరీస్, రూ.2 కోట్ల విలువ గల మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్‌‌, రూ. 8 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్, రూ. కోటి విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ.60 లక్షల విలువైన ఆడి ఎ6తోపాటు మరిన్ని మోడల్స్ ఉన్నాయట. అలా మొత్తానికి రూ. 300 కోట్లకుపైగా ఆస్తులతో ప్రభాస్ లైఫ్ స్టైల్ కూడా బాహుబలి రేంజ్‌లో ఉందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus