చైనాలో జాకీ చాన్ ని మించిన ప్రభాస్..!!

ప్రముఖ విదేశీ నటుడు జాకీచాన్ ని మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మించిపోయాడు. చాన్ స్వదేశం అయినా చైనాలో డార్లింగ్ కి ఎక్కువ మార్కులు కొట్టేసాడు. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అందుకున్న బాహుబలి (ది బిగినింగ్) గత శుక్ర వారం  చైనాలోని  600 థియేటర్లలో విడుదలై రికార్డ్ సృష్టించింది. డైరక్టర్ రాజమౌళి విజువలైజేషన్ కు, ప్రభాస్ నటనకు చైనీయులు జేజేలు పలుకుతున్నారు. రోజురోజుకు థియేటర్లకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.

బాహుబలి కి రేటింగ్ 7.1 నుంచి 7.7 కి పెరుగుతోందని, ఇది జాకీచాన్ సినిమా కంటే ఎక్కువని అక్కడి సినీ వర్గాల వారు చెప్పారు. ఇటువంటి విజయ సూచనలు అందుకోవాలనే జక్కన్న బృందం సినిమా రన్ టైం ను ఇదివరకు ఉన్న నిడివి కంటే 20 నిముషాలు తగ్గించారు. అందుకు తగ్గ ప్రతిఫలం దక్కడంతో టీమ్ సభ్యులు ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు విజయ సంబరాలను పక్కన పెట్టి బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో ప్రభాస్, రానా, తమన్నాఐదు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. వచ్చే నెల నుంచి ఈ షూటింగ్ లో అనుష్క, సత్యరాజ్ కూడా పాల్గొననున్నారు. ఈ సినిమాను ఎలాగైనా నవంబరుకి పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 14 ప్రపంచం మొత్తం విడుదల చేసే యోచనలో నిర్మాతలు ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus