Prabhas: నాగ్ అశ్విన్ ను ఆటపట్టిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..

టాలీవుడ్ రెబల్ స్టార్, ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బిల్లా’ మూవీ 4కె వెర్షన్ తో సెలెక్టెడ్ స్క్రీన్లలో స్పెషల్ షోలు వేయబోతున్నారు. అలాగే డార్లింగ్ నటిస్తున్న సినిమాల నుండి బర్త్ డే విషెస్ తో సర్ ప్రైజింగ్ అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ ‘ఆదిపురుష్’ నార్మల్ టీజర్ తో పాటు త్రీడీ టీజర్ కూడా వచ్చేసింది కాబట్టి.. విషెస్ తో న్యూ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘సలార్’ అప్ డేట్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ‘స్పిరిట్’ కి సంబంధించి.. షూటింగ్ ఎప్పుడు ప్టార్ట్ అవుతుంది ఏంటనే వివరాలు తెలిసే అవకాశముందని భావిస్తున్నారు.

ఇక ఎటుదిరిగి బ్యాలెన్స్ ఉంది నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ -K‘ మాత్రమే. రీసెంట్ గా ఓ ప్రభాస్ ఫ్యాన్.. ‘‘అన్నా నీకసలు నేను గుర్తున్నానా?’’ అంటూ నాగ్ అశ్విన్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేశాడు. దీనికి ‘‘రేపు ప్రాజెక్ట్ -K’ నుండి చిన్న అప్ డేట్ రాబోతుంది’’ అని నాగ్ అశ్విన్ రిప్లై ఇచ్చాడు.

స్మాల్ అప్ డేట్ అంటే కచ్చితంగా ప్రభాస్ చేతివేలు చూపిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం ఆయన చేతిని మాత్రమే చూపించారు. సో, ఇప్పుడు డైరెక్టర్ స్మాల్ అన్నాడంటే ఈ అప్ డేట్ అమితాబ్ పోస్టర్ కన్నా తక్కువగానే ఉంటుంది అంటూ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus