Prabhas, Ajay Devgan: మరోసారి అజయ్ దేవగన్ సినిమాలో ప్రభాస్.. నిజమెంత?

అజయ్ దేవగన్ (Ajay Devgn) – ప్రభాస్ (Prabhas) ..కాంబో అనగానే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఆల్రెడీ అజయ్ దేవగన్ సినిమాలో ప్రభాస్ ఒకసారి నటించాడు కూడా..! 2014 లో అజయ్ దేవగన్ హీరోగా ప్రభుదేవా (Prabhu Deva) దర్శకత్వంలో ‘యాక్షన్ జాక్సన్’ అనే సినిమా వచ్చింది. ఇందులో ప్రభాస్ చిన్న కామియో ఇచ్చాడు. ప్రభాస్ ఓ బాలీవుడ్ సినిమాలో కనిపించడం అదే మొదటిసారి. కానీ 2015 లో వచ్చిన ‘బాహుబలి’ (Baahubali) తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులను తరచూ పలకరిస్తూనే ఉన్నాడు ప్రభాస్.

Prabhas, Ajay Devgan

అతను నటించే సినిమాలు కూడా బాలీవుడ్లో భారీ కలెక్షన్స్ ని సాధిస్తున్నాయి. వాళ్ల కోసం ‘ఆదిపురుష్’ (Adipurush) అనే స్ట్రైట్ బాలీవుడ్ మూవీ కూడా చేశాడు ప్రభాస్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి హిందీ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అది కూడా అజయ్ దేవగన్ మూవీలో అని టాక్. ఇది నిజమా? లేక ప్రచారమా? అంటే ప్రస్తుతానికి ప్రచారమే. అజయ్ దేవగన్ హీరోగా రోహిత్ శెట్టి (Rohit Shetty) దర్శకత్వంలో ‘సింగం అగైన్’ అనే సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాకి సంబంధించి ఓ వీడియో బయటకి వచ్చింది. అందులో యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా ఓ స్కార్పియో గాల్లో నుండి వచ్చి ఒక చోట ఆగింది. అందులో ఓ హీరో ఉన్నాడు. దీపావళి టైంలో అతన్ని చూపిస్తాం అన్నట్టు ఆ వీడియోని అక్కడితో కట్ చేశారు. అయితే ఆ వీడియోకి ప్రభాస్ ‘కల్కి..’ (Kalki 2898 AD) లోని బుజ్జి థీమ్ మ్యూజిక్ అటాక్ చేయడం జరిగింది. అందుకే అజయ్ దేవగన్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

 రెండున్నరేళ్లుగా ఎఫైర్.. టాప్ డైరెక్టర్ విడాకులకు ఆ నటే కారణమా.?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus