Prabhas: అన్ స్టాపబుల్ లీక్స్.. మ్యారేజ్ పై ప్రభాస్ క్లారిటీ ఇదేనా?

అన్ స్టాపబుల్ షో సీజన్2 కు ప్రభాస్ హాజరయ్యే ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ షో ద్వారా పూర్తిస్థాయిలో క్లారిటీ రానుందని సమాచారం. ప్రభాస్ రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఈ షోలో రామ్ చరణ్ ప్రభాస్ కు వీడియో కాల్ చేయగా ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని చరణ్ చెప్పారని బోగట్టా.

ప్రభాస్ తన పెళ్లికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేశారని వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షో లీక్స్ ఈ ఎపిసోడ్ పై అంచనాలను అంతకంతకూ పెంచేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ కోసం ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటున్నామని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ ప్రాజెక్ట్ లకు సంబంధించి కూడా ఈ షో ద్వారా ఎన్నో విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

ఈ ఎపిసోడ్ ను ఎక్కువ నిడివితో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అన్ స్టాపబుల్ షో రికార్డులు కూడా ఈ ఎపిసోడ్ తో బ్రేక్ అవుతాయని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో బిజీగా ఉన్నారు. 2023లో సలార్, 2024లో ప్రాజెక్ట్ కే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఏడాదికి ఒక భారీ ప్రాజెక్ట్ విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలలో మిగతా హీరోలతో పోల్చి చూస్తే ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎక్కువనే సంగతి తెలిసిందే. 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ ఉండగా ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ పారితోషికం 200 కోట్ల రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus