Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

‘నువ్వే కావాలి’.. తెలుగులో రూపొందిన ప్రేమకథా చిత్రం. 2000వ సంవత్సరం చివర్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో తరుణ్ హీరోగా డెబ్యూ ఇచ్చాడు. అతను ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. అటు తర్వాత అతనికి పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు లభించాయి. అయితే ‘నువ్వే కావాలి’ సినిమాని మొదట ‘చెప్పాలని వుంది’ పేరుతో పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టారు. అమీషా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు పోస్టర్స్ కూడా వచ్చాయి.

Mahesh Babu

కానీ ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళలేదు. తర్వాత అదే కథని హీరో సుమంత్ కూడా రిజెక్ట్ చేసినట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక షాకింగ్ విషయం ఏంటంటే.. హీరో మహేష్ బాబు(Mahesh Babu) కూడా ఈ సినిమాని మిస్ చేసుకున్నారట.ఇటీవల స్రవంతి రవికిషోర్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై ఓపెన్ అయ్యారు.’నువ్వే కావాలి’ అనేది ‘నీరమ్’ అనే మలయాళ సినిమాకి రీమేక్ అనేది అందరికీ తెలిసిన సంగతే.

తరుణ్ కాకుండా ముందుగా వేరే హీరోని ఎవరినైనా సంప్రదించారా? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి.. నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘చాలా మందిని అనుకున్నాం. మహేష్ బాబు అయితే బాగుంటుందేమో అని ప్రింట్ పంపించాం. ఆయనకి చూడటానికి సాధ్యపడలేదో ఏమో..! ఆయనతో కుదర్లేదు. తర్వాత సుమంత్ కూడా చూశారు. అతను కూడా ఎందుకో చేయలేకపోయాడు’ అంటూ చెప్పుకొచ్చారు స్రవంతి రవి కిషోర్.

ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.’నువ్వే కావాలి’ అనేది ఎంత రీమేక్ సినిమా అయినప్పటికీ.. ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. కాబట్టి ‘అలాంటి సినిమాని మిస్ చేసుకున్నాము’ అనే బాధ హీరోలకి ఉన్నా లేకున్నా.. వారి అభిమానులకు మాత్రం కచ్చితంగా ఉంటుంది. రవి కిషోర్ కామెంట్స్ చూసి కొంతమంది మహేష్ బాబు అభిమానులు ఇలాగే ఫీలవుతున్నారు.

కానీ మహేష్ బాబు మొదటి నుండి రీమేక్ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. బహుశా అందుకే ‘నువ్వే కావాలి’ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ చూపించలేదేమో.

‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus