The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్'(The RajaSaab) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న నైట్ చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. వాటికి నెగిటివ్ రెస్పాన్స్ వినిపించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మారుతీ ప్రభాస్ స్టార్ డమ్ ని, మంచి కథని, భారీ బడ్జెట్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టాక్ తో ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి బరిలో నిలదొక్కుకోవడం ప్రస్తుతానికైతే కష్టంగానే కనిపిస్తుంది.

The RajaSaab

కనీసం మిగిలిన సినిమాలు వచ్చే లోపు మ్యాగ్జిమమ్ క్యాష్ చేసుకుంటే.. కొంతవరకు సేఫ్ అవ్వొచ్చనేది ట్రేడ్ వర్గాల మాట. మార్నింగ్ షోల నుండి బుకింగ్స్ అయితే ప్రభాస్ గత సినిమాలైన ‘కల్కి 2898 AD’ ‘సలార్’ సినిమాల రేంజ్లో లేవు అన్నది వాస్తవం.అలా అని తీసి పారేసే స్థాయిలో కూడా లేవు.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ది రాజాసాబ్’ కి మొదటి రోజు పర్వాలేదు అనిపించే విధంగా టికెట్స్ సేల్ అవుతున్నాయి.

‘కల్కి..’ ‘సలార్’ రేంజ్లో కాకపోయినా ‘రాధే శ్యామ్’ కంటే బెటర్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఆ రకంగా చూసుకుంటే.. ‘ది రాజాసాబ్’ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.85 కోట్ల గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి మొత్తం ప్రీమియర్స్ తో కలుపుకుని..! నెగిటివ్ టాక్ తో ఈ రేంజ్ ఓపెనింగ్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ అనేది ఆన్ లైన్ బుకింగ్స్ పై పడింది.

కానీ ఈవెనింగ్ మరియు నైట్ షోలకు ఆఫ్ లైన్ బుకింగ్స్ బెటర్ గానే ఉన్నాయి. ఫ్యాన్స్, రెగ్యులర్ మూవీ లవర్స్ సినిమాకి వంకలు పెడుతున్నప్పటికీ… ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బెటర్ టాక్ చెబుతున్నారు. చూడాలి మరి.. ఇలాంటి నెగిటివిటీ మధ్య ‘ది రాజాసాబ్’ డే1 నంబర్స్ అనేవి అంచనా వేసినట్టు ఉంటాయో లేదో..!

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడికి బిగ్ రిలీఫ్..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus