Prabhas: ఆ ఇంటర్వ్యూలో లవ్ స్టోరీస్ గుట్టు విప్పిన ప్రభాస్.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కు ఫ్యాన్స్ లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కు లేడీ ఫ్యాన్స్ లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి2 (Baahubali 2: The Conclusion) సినిమా విడుదలైన సమయంలో కొంతమంది లేడీ ఫ్యాన్స్ ప్రభాస్ బొమ్మను టాటూగా వేయించుకున్నారంటే ప్రభాస్ అంటే ఏ స్థాయిలో అభిమానం ఉందో సులువుగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఒకవేళ స్టార్ హీరో ప్రభాస్ ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశాలు అస్సలు ఉండవు.

అయితే కాలేజ్ లో చదివే సమయంలో ప్రభాస్ లవ్ ప్రపోజ్ చేస్తే కొంతమంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారట. ఈ విషయాలను ప్రభాస్ స్వయంగా చెప్పుకొచ్చారు. సాహో (Saaho) సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్ ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. హీరోయిన్లతో ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా అనే ప్రశ్నకు హీరోయిన్లతో ప్రేమ గురించి ఆలోచించలేదని ఆ దిశగా కూడా నా థాట్స్ లేవని కామెంట్లు చేశారు.

ఏ అమ్మాయి అయినా రిజెక్ట్ చేసిందా అనే ప్రశ్నకు చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారని ప్రభాస్ పేర్కొన్నారు. ఆ సమయానికి ప్రభాస్ కు సెలబ్రిటీ స్టేటస్ లేదు కాబట్టి వాళ్లు రిజెక్ట్ చేసి ఉండవచ్చని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. ప్రభాస్ కొంతమంది హీరోయిన్లతో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం ;ఏదని ప్రభాస్ వైపు నుంచి క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్ సినిమాలపైనే పూర్తిస్థాయిలో ఫోకస్ పెడుతున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేసే హిట్లతో ప్రేక్షకుల ముందుకు రావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఆర్మాక్స్ లాంటి ప్రముఖ సంస్థల సర్వేలలో సైతం టాప్ లో నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus