Prabhas, Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో భారీ మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా కొంతమంది స్టార్ హీరోలు సోలో హీరోగా నటించడానికి ఆసక్తి చూపుతుంటే మరి కొందరు మాత్రం సోలో హీరోగా నటిస్తూనే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ కే ఈవెంట్ లో భాగంగా ప్రభాస్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. చరణ్ తో కలిసి నటించాలని ఉందని ప్రభాస్ కామెంట్లు చేశారు.

బ్లూ స్క్రీన్ సన్నివేశాల్లో నటించడం మొదట్లో చాలా బోర్ కొట్టిందని (Prabhas) ప్రభాస్ అన్నారు. అంత పెద్ద బ్లూ స్క్రీన్ ముందు నేను చాలా చిన్నగా కనిపించేవాడినని ప్రభాస్ పేర్కొన్నారు. అయితే గ్లింప్స్ చూసిన తర్వాత ఆనందం వేసిందని బాగుందనిపించిందని ప్రభాస్ వెల్లడించారు. మన దేశంలో ఉన్న అద్భుతమైన డైరెక్టర్లలో రాజమౌళి ఒకరని ఆర్.ఆర్.అర్ చాలా గొప్ప మూవీ అని ఈ సినిమాకు ఆస్కార్ రావడం సంతోషాన్ని కలిగించిందని ప్రభాస్ అన్నారు.

ఈ సినిమాకు ఆస్కార్ రావడం మన దేశ ప్రజలకు దక్కిన గౌరవం అని నేను భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటికి జక్కన్న అర్హుడని ప్రభాస్ అర్హుడని ప్రభాస్ వెల్లడించారు. రామ్ చరణ్ నాకు మంచి స్నేహితుడు అని ఏదో ఒకరోజు నేను, రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తామని ప్రభాస్ వెల్లడించారు. కల్కి 2898 ఏడీ సినిమాతో వచ్చే ఏడాది ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

దీపికా పదుకొణే హీరోయిన్ గా అమితాబ్ కీలక పాత్రలో కమల్ హాసన్ విలన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక సంచలనం అని చెప్పవచ్చు. భవిష్యత్తుకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రభాస్ కు వరుసగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus