ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. సలార్ మూవీ మూడు రోజుల్లో 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈరోజు సెలవు దినం కావడంతో ఈరోజు కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలోనే కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సలార్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సలార్ మూవీ కథ నాకెంతో నచ్చిందని విన్న వెంటనే అంగీకరించానని ఆయన తెలిపారు.
నా సినీ కెరీర్ లో చేసిన భిన్నమైన పాత్రల్లో ఈ సినిమా కూడా ఒకటని బాహుబలి నా కెరీర్ కు బెంచ్ మార్క్ ను సెట్ చేసిందని ప్రభాస్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే సలార్ కు ఓకే చెప్పానని ప్రభాస్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రేక్షకులు సైతం వైవిధ్యమైన కంటెంట్ ను ఇష్టపడుతున్నారని ప్రపంచమంతా భారతీయ సినిమాల గురించి చర్చించుకుంటోందని ప్రభాస్ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని మన దేశ సినిమాల గురించి మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పని చేయడం అద్భుతమైన అనుభూతి అని ప్రభాస్ వెల్లడించారు. సలార్ కు పార్ట్2 ఉందని స్పష్టం చేశామని ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సలార్2 మరింత అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ అన్నారు. సలార్ మూవీ బయ్యర్లకు భారీ స్థాయిలో లాభాలను అందించడం ఖాయమని తేలిపోయింది.
సినిమా కలెక్షన్ల విషయంలో (Prabhas) ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. సలార్ మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.