‘హ్యాపీ వెడ్డింగ్’ ట్రైలర్ పై ప్రభాస్ స్పందన

  • June 30, 2018 / 11:16 AM IST

“ఒక మనసు” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక.. చాలా గ్యాప్ తర్వాత చేసిన మూవీ “హ్యాపీ వెడ్డింగ్”. సుమంత్ అశ్విన్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యువ డైరక్టర్ లక్ష్మన్ కార్య తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ట్రైలర్‌ నిన్న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. “మా అబ్బాయిలు చాలా రొమాంటిక్ ” అంటూ హీరో చెప్పిన డైలాగ్.. “వైన్ తాగబోయి వోడ్కా తాగాను” అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ యువతని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు.

“సుమంత్ అశ్విన్, లక్ష్మణ్, నిహారిక, నా స్నేహితులు వంశీ, ప్రమోద్‌కు గుడ్ లక్” అని ట్వీట్ చేశారు. అందుకు సమాధానంగా థ్యాంక్యూ డార్లింగ్ అంటూ యువీ క్రియేషన్ వాళ్ళు రీట్వీట్ చేశారు. యువీ క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమాతో పాటు ప్రభాస్ తో సాహో నిర్మిస్తున్నారు. ఇది ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే నాగ చైతన్యతో సవ్యసాచి రూపొందిస్తున్నారు. ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూడు సినిమాలు వేరే వేరే జోనర్స్ లో తెరకెక్కినవే. ఇక “హ్యాపీ వెడ్డింగ్” మూవీ ద్వారా నిహారిక మెగా హిట్ అందుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus