Prabhas, Maruthi: ప్రభాస్‌తో పాటు షూటింగ్‌లో ‘రాధే శ్యామ్’ బ్యూటీ రిద్ధి..!

  • October 27, 2022 / 11:11 PM IST

రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఏమో కానీ కొత్తవి కమిట్ అవుతున్నాడు. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్-K’ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

సందీప్ రెడ్డి వంగాతో చెయ్యబోయే ‘స్పిరిట్’ సంగతేంటో తెలియాలి మరి. ఇక ఇంతలో డైరెక్టర్ మారుతితో ఓ మూవీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, సడెన్‌గా సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ ఇచ్చాడు. పైగా బిజీ షెడ్యూల్స్ కారణంగా కేవలం ఆరు నెలల్లోనే గుమ్మడికాయ కొట్టెయ్యాలనే కండీషన్ కూడా పెట్టాడట ప్రభాస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డీలక్స్ రాజా’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ప్రభాస్ ఇమేజ్ అండ్ స్టార్ డమ్‌కి తగ్గట్టు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందా, లేదా అనేది తెలియదు కానీ.. ఎలాంటి చప్పుడు లేకుండా సైలెంట్‌గా షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఈ మూవీ నుండి హీరో లుక్ అదీ రివీల్ అవ్వకుండా, ఎవరూ ఫొటోలవీ తియ్యకుండా చాలా జాగ్రత్త పడ్డారట యూనిట్. అంతేనా.. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్‌లో 7 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో డార్లింగ్ 3 డేస్ పాల్గొన్నాడట. మిగతా నాలుగు రోజులు ఇతర ఆర్టిస్టులతో షూటింగ్ జరిపారట.

ప్రభాస్‌తో పాటు ‘రాధే శ్యామ్’ లో స్పోర్ట్స్ వుమెన్‌గా కనిపించిన రిద్ధి కుమార్, టాలీవుడ్ యంగ్ కమెడియన్ వైవా హర్ష కూడా సెట్లో జాయిన్ అయ్యారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. మిగతా ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట పాన్ ఇండిాయా స్టార్ ప్రభాస్. అన్నీ అనుకున్నట్టు జరిగితే కనుక వచ్చే ఏడాది ప్రభాస్ నుండి మూడు సినిమాలు వచ్చే అవకాశముంది..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus