ఫ్యాన్స్ కోసం ప్రభాస్ డెసిషన్!

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలు లైన్లో పెడుతున్నారు. అయితే ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా.. అవన్నీ కూడా థియేటర్లో రావడానికి టైమ్ పట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ‘బాహుబలి’ తరువాత మొదలుపెట్టిన ‘సాహో’ కోసం ప్రభాస్ చాలా సమయం తీసుకున్నాడు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ విషయంలో కూడా అలానే జరుగుతోంది. ప్రభాస్ సినిమాలు ఇలా ఆలస్యంగా రిలీజ్ అవుతుండడం అభిమానులను నిరాశ పరుస్తుంది.

ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా తమ హీరో నుండి రాకపోయేసరికి ఫ్యాన్స్ అంతా అప్సెట్ అవుతున్నారు. దీంతో ప్రభాస్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుండి మాస్ సినిమాలకు మూడు నెలలకు మించి డేట్స్ ఇవ్వకూడదని ప్రభాస్ అనుకుంటున్నాడు. తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం 60 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలని.. సినిమా మొత్తాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభాస్ దర్శకులకు కండీషన్స్ పెడుతున్నాడట.

అందుకే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ‘సలార్’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసి.. రెండో షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్, మే నాటికి షూటింగ్ పూర్తి చేసేసేలా ఉన్నారు. మరోపక్క ‘ఆదిపురుష్’ చిత్రబృందం కూడా షూటింగ్ మొదలుపెట్టేసింది. ప్రభాస్ లేకుండానే షూటింగ్ జరిపిస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. మొత్తానికి ప్రభాస్ తన చేతుల్లో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus