Prabhas: అలా జరిగితే రాధేశ్యామ్ కు నష్టమేనా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచడంతో పాటు ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ అభిమానులకు కలిగేలా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న జక్కన్న కళ్లు చెదిరే విజువల్స్ తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడం గ్యారంటీ అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తున్నారు. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజైతే భారీస్థాయిలో కలెక్షన్లు గ్యారంటీ అని అభిమానులు సైతం నమ్ముతున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ పై కూడా భారీగా అంచనాలు నెలకొన్నా ఆర్ఆర్ఆర్ తో పోలిస్తే రాధేశ్యామ్ పై అంచనాలు తక్కువగా ఉన్నాయి.

సంక్రాంతికి వారం ముందు రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ ప్రభావం రాధేశ్యామ్ పై కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ కు పాజిటివ్ టాక్ వచ్చి రాధేశ్యామ్ కు టాక్ అటూఇటుగా ఉంటే మాత్రం రాధేశ్యామ్ మూవీ నష్టపోవాల్సి ఉంటుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు లేవని ప్రచారం జరుగుతుండటం రాధేశ్యామ్ సినిమాకు మైనస్ గా మారుతోంది.

ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళికి ఉన్న కాన్ఫిడెన్స్ ప్రభాస్ కు రాధేశ్యామ్ విషయంలో ఉందా? అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వల్ల రాధేశ్యామ్ డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడుతున్నట్టు బోగట్టా. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాగా బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus