మూడున్నరేళ్లు నిర్విరామంగా కొనసాగిన బాహుబలి చిత్రీకరణ పూర్తికావడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలాక్స్ అయ్యారు. ఈ సెలవులను ఆనందించాలని డార్లింగ్ సంబరపడేలోపే ఆయనకు మరో పని పడింది. సుజీత్ దర్శకత్వంలో చేయనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం బరువుతగ్గాల్సి వచ్చింది. బాహుబలి కథ డిమాండ్ మేరకు పర్ఫెక్ట్ గా ఉన్న ప్రభాస్ తన బరువుని పెంచారు. అయితే సుజీత్ సినిమా స్టోరీ డిమాండ్ మేరకు 20 కిలోలు బరువుతగ్గాల్సి ఉంది. కాబట్టి యంగ్ రెబల్ స్టార్ బరువు తగ్గే పనిలో పడ్డారు. ప్రత్యేక డైట్ ఫాలో అవుతూ నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చేస్తున్నారు.
డైరక్టర్ సుజీత్ ప్రభాస్ 19 వ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే డైలాగులను మూడు భాషల్లో రాసుకుంటున్నారు. ఇందుకు హిందీ, తమిళం రచయితలను నియమించుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు బాహుబలి చిత్రానికి రాజమౌళి పాటించిన సూత్రాన్నీ సుజీత్ పాటిస్తున్నారు. మే నెలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ ని యువీ క్రియేషన్స్ వారు 150 కోట్లతో నిర్మించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.