ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రేక్షకులకు మూడు ప్రపంచాలను నాగ్ అశ్విన్ చూపించబోతున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కల్కి 2898 ఏడీ తెరకెక్కగా పెంచిన టికెట్ రేట్లతో రిలీజ్ కానుండటంతో ఈ సినిమా సులువుగానే 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. కల్కి సినిమా బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు అని సమాచారం.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా 600 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ సైతం భారీ మొత్తానికి అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది. ప్రభాస్ ఈ సినిమాకు ఏకంగా 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయిస్తూ ఉండటంతో ప్రభాస్ భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారు.
అమితాబ్ (Amitabh Bachchan) , కమల్ (Kamal Haasan) చెరో 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారని దీపిక (Deepika Padukone) రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. మిగతా ఆర్టిస్టుల, టెక్నీషియన్ల పారితోషికాలు 50 కోట్ల రూపాయలు అని భోగట్టా. కల్కి 2898 ఏడీ విమర్శకులను సైతం మెప్పించే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాలో యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో దీపిక నటన సైతం అద్భుతంగా ఉండనుందని ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి లాంటి సినిమాలు టాలీవుడ్ ఖ్యాతిని ఊహించని స్థాయిలో పెంచుతాయని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ రిలీజ్ సమయానికి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.