‘బాహుబలి'(సిరీస్) తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అతని మార్కెట్ పది రెట్లు పెరిగింది. ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికీ రూ.190 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. నెగిటివ్ టాక్ తోనే ‘ఆదిపురుష్’ ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇది ప్రభాస్ (Prabhas) రేంజ్ అనడంలో సందేహం లేదు. పైగా ‘ఆదిపురుష్’ కి ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేసింది లేదు. అయితే రెండు ఏరియాల్లో మాత్రం ప్రభాస్ మార్కెట్ చాలా డల్ గా ఉంది. ఒకటి మలయాళంలో, మరొకటి తమిళంలో..! అందుకే ప్రభాస్ తో నెక్స్ట్ సినిమాలు చేసే దర్శకులు ఈ రెండు ఏరియాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముందుగా రాబోతున్న ‘సలార్’ విషయానికి వస్తే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు.
అతనికి అక్కడ మంచి మార్కెట్ ఉంది. సో మలయాళంలో ‘సలార్’ కి మంచి ఓపెనింగ్స్ రావచ్చు. ఇక ‘ప్రాజెక్ట్ కె’ లో కమల్ హాసన్ ని ఎంపిక చేసుకున్నారు. కమల్ తమిళంలో సీనియర్ స్టార్ హీరో అయినప్పటికీ.. ‘విక్రమ్’ మూవీతో రికార్డ్ కలెక్షన్స్ ను సాధించాడు. సో ‘ప్రాజెక్ట్ కె’ విషయంలో తమిళ బిజినెస్ కి ఇబ్బంది ఉండదు. మరి మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!