టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ జోడీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనుష్క ప్రభాస్ జంట ఒకటి వీరిద్దరూ మొదటిసారి బిల్లా సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత వీరు మిర్చి సినిమాలో వీరిద్దరి నటన ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మరోసారి వీరిద్దరూ కలిసి బాహుబలి సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నాలుగు సినిమాలలో కలిసిన నటించడంతో వీరిద్దరి పర్ఫామెన్స్ ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా ఈ జోడికి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు.
ఈ విధంగా అనుష్క ప్రభాస్ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ వీరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ప్రభాస్ పలు సందర్భాలలో స్పందిస్తూ అనుష్క తాను ఇద్దరు కూడా మంచి స్నేహితులమేనని ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అంటూ చెప్పుకోవచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి వచ్చే వార్తలు ఆగిపోయాయి.
ఈ విధంగా అనుష్క ప్రభాస్ (Prabhas) ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో వీరి గురించి ఒకరికొకరు పూర్తిగా తెలుసు అయితే ప్రభాస్ కి మాత్రం అనుష్కలో ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏ మాత్రం నచ్చదట తన పద్ధతి మార్చుకోమని ఎన్నిసార్లు ప్రభాస్ కి చెప్పిన అనుష్క తీరు మార్చుకోకపోవడంతో ప్రభాస్ చివరికి చెప్పడమే మానేసారని తెలుస్తుంది. మరి అనుష్కలో ఉన్నటువంటి ఆ చెడ్డ అలవాటు ఏంటి అనే విషయానికి వస్తే..
అనుష్క ఏదైనా దీర్ఘంగా ఆలోచించినా లేదా కాస్త కంగారు పడిన వెంటనే ఆమె చేతి వేళ్ళు నోట్లోకి పోయి గోర్లు మొత్తం కొరికేస్తూ ఉంటారట. ఇలా గోర్లు తరచూ కొరుకుతూ ఉంటారని ఈ అలవాటు ప్రభాస్ కి ఏమాత్రం నచ్చదని తెలుస్తుంది. ఇలా పలు సందర్భాలలో ఆమె గోర్లు కొరకడం చూసి ముందు ఆ పద్ధతి మార్చుకోమని తనకు సలహా కూడా ఇచ్చారట అయితే అప్పటికి ఓకే అని చెప్పిన అనుష్క యధావిధిగా ఆలోచనలో పడితే తనకు తెలియకుండానే గోర్లు మొత్తం కొరికేస్తూ ఉంటారని తెలుస్తోంది.