డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తున్న ప్రభాస్!

బాహుబలి తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రభాస్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఈ షూటింగ్ గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఈ సీన్స్ చేసేటప్పుడు డూప్ అవసరమైన షాట్స్ వద్ద కూడా ప్రభాస్ నటించారంట. సుజీత్ వద్దని చెప్పినప్పటికీ వినకుండా సాహసంతో కూడిన ఫీట్స్ చేసారని సమాచారం. ఆ షాట్స్ తీసేటప్పుడు చిత్ర యూనిట్ మొత్తం బయపడ్డారంట. అయినా ప్రభాస్ మాత్రం ఎంతో ఉత్సాహంతో వాటికి బాగా చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఆ షాట్స్ కూడా బాగా వచ్చాయని డైరక్టర్ సంతోషంగా ఉన్నారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ దుబాయ్ లో మొదలు కానుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus